Thursday, January 23, 2025

ప్రధాని మోడికి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం..

- Advertisement -
- Advertisement -

పారిస్: ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాస్టీల్‌డే పరేడ్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రన్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఐరోపాలోనే అతిపెద్ద సైనిక కవాతుగా పేరొందిన బాస్టీల్ డే పరేడ్‌లో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటున్నాయి. త్రివిధ దళాలకు చెందిన 269 మంది సభ్యుల బృందం ఫ్రాన్స్ దళాలతో కలిసి ఈ పరేడ్‌లో పాల్గొంది.దీంతో పాటుగా భారత్‌కు చెందిన నాలుగు రాఫెల్ విమానాలు రెండు సి17 గ్లోబ్ మాస్టర్లు పారిస్ గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించాయి.

మోడీకి అత్యున్నత పురస్కారం ప్రదానం
ఫ్రాన్స్‌లో రెండు రోజలు పర్యటనకోసం వచ్చిన ప్రధాని మోడీ గురువారం అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆయన మార్సిల్లేలో కొత్త భారత కాన్సులేట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అనంతరం అధ్యక్షుడు మేక్రాన్ దంపతులు ఇచ్చిన విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేక్రాన్ ప్రధాని మోడీని ఫ్రాన్స్ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన ‘ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్’ అవార్డుతో సత్కరించారు. ఇంతకు ముందు ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, అప్పటి వేల్స్ యువరాజుగా ఉండిన కింగ్ చార్లెస్, జర్మనీ మాజీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ ఉన్నారు. ఎంతో వినమ్రంగా తాను అవార్డును అందుకొంటున్నానని, 140 కోట్లమంది భారతీయులకు లభించిన గౌరవం ఇదని మోడీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News