Monday, December 23, 2024

‘ఆపరేషన్ గంగ’ విజయవంతం: మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi attributes success of Operation Ganga

పుణె: యుద్ధంలో చిక్కుకున్న ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడంలో ‘ఆపరేషన్ గంగ’ విజయవంతమైందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దీనివల్ల ప్రపంచ రంగంలో భారత్ ప్రభావం పెరుగుతోందని వివరించారు. ఇక్కడ సింబయోసిస్ యూనివర్శిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు, దాని ఆరోగ్యం ధామ్‌ను ప్రారంభిస్తూ ఆయన, ‘ మేము యుద్ధ మండలం నుంచి వేలాది మంది భారతీయులను ఆపరేషన్ గంగ ద్వారా సురక్షితంగా స్వదేశానికి తరలించాం. ప్రపంచంలో భారత్‌కు పెరుగుతున్న ఆదరణ వల్లే ఇది సాధ్యమైంది. తమ దేశ పౌరులను అక్కడి నుంచి తరలించడంలో ఇప్పటికీ అనేక పెద్ద దేశాలు ఇబ్బంది పడుతున్నాయి ’ అన్నారు. ఆయన ఆదివారం పుణెలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఒకవేళ దేశం ఈ మాత్రం మారిందంటే ఆ క్రెడిట్ యువతదే’ అన్నారు. ఏ రంగాలలోనైతే దేశం నిలబడలేదని అనుకున్నామో ఆ రంగాల్లో గ్లోబల్ లీడర్‌గా దేశం ఎదుగుతోంది అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మొబైల్, ఎలక్ట్రానిక్ తయారీ, రక్షణ రంగాలను ఉదాహరించారు.నేడు భారత్ డిఫెన్స్ ఎగుమతిదారుగా మారిందన్నారు. మొబైల్ తయారీలో భారత్ రెండో స్థానానికి ఎదిగిందన్నారు. ఏడేళ్ల క్రిందట దేశంలో రెండే మోబైల్ తయారీ కంపెనీలు ఉండేవని,నేడు 200కు పైగా తయారీ కంపెనీలు ఉన్నాయన్నారు. సాఫ్ట్‌వేర్ పరిశ్రమ మొదలుకుని ఆరోగ్య రంగం, కృత్రిమ మేధ మొదులుకుని ఆటోమోబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాల తదితరాల వరకు దేశం ఎదిగిందన్నారు. మన యువత ప్రతిభకు ‘స్టార్టప్ ఇండియా’, మేక్ ఇన్ ఇండియా’, ఆత్మనిర్భర్ భారత్’ వంటివి ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్నారు. నేడు భారత్ కొత్తవి ఆవిష్కరిస్తోంది, ప్రపంచంలో తన ప్రభావాన్ని పెంచుకుంటోంది అని తెలిపారు. కొవిడ్19కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారీ సామర్థంను భారత్ చాటిందన్నారు. స్థానిక సవాళ్లకు పరిష్కారాలు విశ్వవిద్యాలయాల నుంచి రావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News