- Advertisement -
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి వారాల సమయం ఉన్నందున, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు అయోద్యలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా అయోద్యలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధాని ఉత్తరప్రదేశ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 11:15 గంటలకు అయోధ్య రైల్వే స్టేషన్, 12.15 గంటలకు కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రధానమంత్రి బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. రామమందిర ప్రారంభోత్సవానికి ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలైంది. వచ్చే ఏడాది జనవరి 22న జరగనున్న ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రధాని నరేంద్ర మోడీ సహా పలు ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొంటారు.
- Advertisement -