న్యూఢిల్లీ: కోర్టుల్లో స్థానిక భాషలనే ఉపయోగించాలని ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా వాదించారు. తద్వారా సామాన్యులకు న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఏర్పడి దాంతో కనెక్ట్ అవుతారన్నారు. “మనం కోర్టుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలి” అని ఆయన శనివారం ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ చెప్పారు. న్యాయం సులభతరంగా జరగడానికి కాలం చెల్లిన పాత చట్టాలను తొలగించాలని కూడా ఆయన ముఖ్యమంత్రులను కోరారు. “మేము 2015లో దాదాపు 1,800 చట్టాలు అసంబద్ధమైనవిగా గుర్తించాము. వాటిలో 1,450 చట్టాలను కేంద్రం తొలగించింది. కానీ వాటిలో కేవలం 75 చట్టాలను మాత్రమే రాష్ట్రాలు తొలగించాయి” అన్నారు.
భారత్ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందని, ప్రతి ఒక్కరికి న్యాయం త్వరగా, సులభతరంగా అందేలా న్యాయవ్యవస్థను రూపొందించాల్సి ఉందని ప్రధాని కోరారు. “మన దేశంలో రాజ్యాంగాన్ని కాపాడడంతో పాటు, పౌరుల హక్కులను కాపాడే చట్టాలను కూడా న్యాయవ్యవస్థ కాపాడుతోంది. ఈ రెండూ దేశంలో నిర్ణీత వ్యవధిలో న్యాయం పౌరులకు అందేలా చూస్తాయని నేను నమ్ముతున్నాను. న్యాయవ్యవస్థను మెరుగుపరచడానికి మేము చేయగలిగిందంతా చేస్తున్నాము. న్యాయవ్యవస్థ ఇన్ ఫ్రాస్టక్చర్ ను కూడా మేము అప్ గ్రేడ్ చేస్తున్నాము” అన్నారు.
PM @narendramodi addresses the Joint Conference of Chief Ministers of States and Chief Justices of High Courts.#ITVideo #NarendraModi pic.twitter.com/4rqFLtFQKG
— IndiaToday (@IndiaToday) April 30, 2022