Thursday, September 19, 2024

ప్రధాని మోడీ 45 గంటల ధ్యానం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ప్రఖ్యాతిగాంచిన వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సంయాంత్రం తన 45 గంటల ధ్యానాన్ని ప్రారంభించారు. సమీపంలోని తిరువనంతపురం నుంచి హెలికాప్టర్‌లో కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మొదుగా భగవతి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ఫెర్రీలో రాక్ మెమోరియల్ చేరుకున్న మోడీ ధ్యానం ప్రారంభించారు. జూన్ 1వ తేదీ వరకు ధ్యానం సాగుతుంది. తెల్లని ధోవతి, శాలువా ధరించిన మోడీ భగవతి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం అమ్మవారిని గర్భాలయంలో దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు అమ్మవారికి ఈ సందర్భంగా ప్రత్యేక హరతి ఇచ్చి ప్రధాని మోడీకి ప్రసాదంగా శౠలువాతోపాటు అమ్మవారి చిత్రపటాన్ని అందచేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన షిప్పింగ్ కార్పొరేషన్ నిర్వహించే ఫెర్రీ సర్వీసులో వివేకానంద రాక్ మెమోరియల్ చేరుకున్నారు. ధ్యానంలోకి వెళ్లడానికి ముందు మోడీ కొద్ది సేపు ధ్యాన మండపానికి దారితీసే మెట్ల పైన కూర్చుని అద్భుతంగా కనిపించే సముద్ర అందాలను వీక్షించారు. జూన్ 1న ధ్యానం ముగించిన అనంతరం ఇక్కడ నుంచి బయల్దేరి వెళ్లడానికి ముందు ప్రధాని కన్యాకుమారిలోని తిరువల్లువర్ విగ్రహాన్ని దర్శించనున్నారు.

కాగా..మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ంతై పెరియార్ ద్రవిడర్ సంఘంతోసహా పలు ద్రవిడ సంఘాలు మదురైలో నల్లజెండాల ప్రదర్శనను నిర్వహించాయి. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కూడా గో బ్యాక్ మోడీ అంటూ పెద్దసంఖ్యలో పోస్టులు దర్శనమిచ్చాయి. జూన్ 1న ఏడవ దశ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మోడీ ధ్యానాన్ని టివి చానెళ్లలో ప్రసారం చేయరాదంటూ కూడా ప్రతిపక్షలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోడీ రాకను పురస్కరించుకుని కన్యాకుమారిలో భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. దాదాపు 2,000 మంది పోలీసు సిబ్బందితోపాటు నేవీ, కోస్తా గార్డు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. 1892 సంవత్సరంలో హిందూ ధర్మ ప్రచారకులు, సాధువు స్వామి వివేకానంద సముద్రంలో ఉన్న ఈ రాతిపైనే ధ్యానం చేశారు. ఆయన స్మారకార్థమే వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మితమైంది. ప్రధాని మోడీ ఈ స్మారక భవనంలో 45 గంటల పాటు బస చేయనుండడం ఇదే మొదటిసారి. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ ధ్యానంలోకి వెళ్లడం ఇది మొదటిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన కేదార్‌నాథ్‌లోని గుహలో ధ్యానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News