Monday, November 18, 2024

మోడీ ముఠా నాయకుడిలా వ్యవహరిస్తున్నాడు: కూనంనేని సాంబశివరావు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం:   దేశాన్ని దోచుకుతింటున్న వారికి ప్రధాని మోడీ ముఠా నాయకుడిలా వ్యవహరిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం చేస్తూ మోడీ ప్రజలకు నీతులు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ పర్యటన సందర్భంగా అన్ని జిల్లాల్లో సిపిఐ నేతలను అరెస్టు చేయడం దారుణమన్నారు.

కమ్యూనిస్టులను తిట్టడం ఫ్యాషన్‌ అయిపోయిందని దుయ్యబట్టారు. రామగుండం ఎరువుల కర్మాగారం రెండు సంవత్సరాలు క్రితమే ప్రారంభమయితే ఇప్పుడు జాతికి అంకితం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు అమ్మేస్తున్నారని నిలదీశారు. ఎరువుల కర్మాగారం కూడా అమ్మరని గ్యారంటీ లేదన్నారు. ప్రైయివేటీకరణకు రూ. 6 లక్షల కోట్లు కేటాయించడం మోడీ  ఫాసీజానికి నిదర్శనం అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం వందశాతం పెరిగిందని పేర్కొన్నారు. దేశంలో శ్రీలంక పరిస్థితులున్నాయన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సింగరేణి బొగ్గు తవ్వాలని డిమాండ్‌ చేశారు. అరబిందో కంపెనీ కోయగూడెం ఓసీని దక్కించుకున్నారని, ఇది తప్పు అయితే తనను ఉరి తీయాలని లేదా మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఒరిస్సాలో చంద్ర గుప్తా మైన్ ను రాజా గోపాల్ రెడ్డికి అప్పగించి సింగరేణి ప్రైవేటీకరణకు అడుగులు వేయడం లేదా అని ప్రశ్నించారు. కొయ్యగూడెం జేవీర్‌ ఓపెన్‌ కాస్ట్‌లను ప్రైవేట్‌పరం కానివ్వకుండా పోరాటం చేస్తామన్నారు. శ్రావణిపల్లి కల్యాణ్ ఖని, మందమర్రి మైన్ లను ప్రైవేటు పరంచేయనున్నారని ఆరోపించారు. మోడీని ఎదుర్కొనడానికి ఎవరినైనా కలుపుకుపోతామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News