Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సిఎం కెసిఆర్ 68వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ట్వీటర్ వేదికగా సిఎం కెసిఆర్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేస్తూ…  సిఎం కెసిఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గత వారం రోజులుగా మోడీ సర్కార్ పై సిఎం కెసిఆర్ విమర్శలు చేయడంతో.. బిజెపి-టిఆర్ఎస్ ల మధ్య మాటల యుధ్దం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపడం ప్రధాన్యత సంతరించుకుంది.

PM Modi Birth Day Wishes to CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News