హైదరాబాద్: రాష్ట్రంలో ఫ్లెక్సీ ల యుద్ధం కలకలంరేపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు అనుకూలంగా, ప్రతికూలంగా నగరంలో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు వెలిశాయి. పోటాపోటీగా వెలిసిన ఈ ఫ్లెక్సీలను హైదరాబాదీలు ఆసక్తిగా తిలకిస్తున్నా రు. కేంద్ర బడ్జెట్‌ను అమృత్‌కాల బడ్జెట్‌గా అభివర్ణిస్తూ కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, కాలకూట విషపు బడ్జెట్‌గా పేర్కొంటూ వ్యతిరేకంగా మరికొన్ని పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోడీఫొ టోతో కూడిన ఒక బ్యానర్‌లో తమకు లబ్ధి చేకూర్చే బడ్జెట్ ప్రవేశపెట్టారని, ధన్యవాదాలు మోడీ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను ‘మిడిల్ క్లాస్ పీపుల్ ఆఫ్ తెలంగాణ’ పేరిట ఏర్పాటు చేశారు.
వాటి పక్కనే కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అమృత్ కాలం కాదు..కాలకూట విషం లా ఉందని, బైబై మోడీ అని రాసి ఉన్న ఫ్లెక్సీలు పోటీగా వెలిశాయి. అయితే ఈ పోస్టర్లను మా త్రం ఎవరు ఏర్పాటు చేశారన్నదానిపై స్పష్టత లేదు. వ్యతిరేకంగా వెలిసిన పోస్టరులో మాత్రం 2014లో ఒక వ్యక్తి నెత్తిపై పూర్తిగా జుట్టు ఉండి 2023 నాటికి క్రమంగా అతని నెత్తిపై జుట్టంతా ఊడిపోయి బోడి గుండుగా మారిపోయిందని అర్థం వచ్చేలా చిత్రీకరించారు. మోడీ పాలనలో ఇదీ ఓ సామాన్యుడు, భారత వృద్ధి రేటు అని వ్యంగ్యంగా క్యాప్షన్ రాశారు.