Saturday, September 21, 2024

మేం రెడీ ..మీరు రెడీనా

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారత్ అమెరికా మధ్య సరైన వ్యాపార, వాణిజ్య సానుకూల వాతావరణాన్ని రెండు దేశాల ప్రభుత్వాలు నెలకొల్పాయాని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఇక ఇరుదేశాలకు చెందిన వ్యాపార వర్గాలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవల్సిన బాధ్యత ఉందని పిలుపు నిచ్చారు. కార్పొరేట్ రంగం ఈ విషయంపై దృష్టి సారించడం ద్వారా వారు సంస్థాగతంగా విలసిల్లేందుకు, ఇరుదేశాల మరింత వాణిజ్య సంబంధాలు ఖరారు అయ్యేందుకు వీలేర్పడుతుందని తెలిపారు. ఇండియా, అమెరికాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, ధార్మికవేత్తలను ఉద్ధేశించి ఇక్కడి కెనెడీ సెంటర్‌లో తమ అమెరికా పర్యటన దశలో ప్రధాని మాట్లాడారు.

భారత్ అమెరికాల మధ్య సంబంధాలు కేవలం సర్దుబాట్లకు ఉద్ధేశించినవి కావని, చిత్తశుద్ధితో, సారూప్యత, ఉమ్మడి కట్టుబాట్లు, సహానుభూతితో కూడుకున్నవని తెలిపారు. రక్షణ రంగం మొదలుకుని ఏవియేషన్, నిర్మాణరంగం, ఉత్పత్తి రంగం , ఐటి అంతరిక్షం ఈ విధంగా పలు స్థాయిలో ఇరుదేశాల మధ్య సంబంధాల దిశలో వాణిజ్య వ్యాపార సంబంధాలు మరింత విస్తృతం అయ్యాయని, సంబంధిత రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు , ఫిలాంత్రపిస్టులు ముందుకు వచ్చి సరైన విధంగా స్పందించాల్సిన బాధ్యత ఉందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News