Tuesday, December 24, 2024

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం… ఓటు వేసిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యుపి సిఎం యోగి,  తమిళనాడు సిఎం స్టాలిన్, పలువురు మంత్రులు, ఎంఎల్ఎలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటు భవన్ లోని పోలింగ్ కేంద్రంలో ప్రధాని మోడీ ఓటు వేశారు.  దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 15వ భారత రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు దాదాపు 4,800 మంది ఎంపిలు, ఎంఎల్‌ఎలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జులై 21న పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్‌డిఎ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News