Sunday, December 29, 2024

ఓటేసిన పిఎం మోడీ

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 2.51 కోట్ల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోని రాణిప్ లో నిషాన్ పబ్లిక్ స్కూల్లోని పోలింగ్ బూత్ లో మోడీ ఓటేశారు. పోలింగ్ కేంద్రానికి సమీపంలో తన కాన్వాయ్ ని ఆపి లోపలికి నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ ఉన్న ఓటర్లకు మోడీ అభివాదం చేశారు. ఈ ఎన్నికలలో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేయాలని ప్రధాని మోడీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్ లోని శైలజ్ అనుపమ్ పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆహ్మదాబాద్ లో ఓటేశారు. రెండో విడత పోలింగ్ 14 జిల్లాలోని 93 నియోజకవర్గాల్లో జరుగుతోంది. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News