Friday, November 1, 2024

జవాన్లకు మిఠాయి తినిపించిన ప్రధాని మోడీ..

- Advertisement -
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి జవాన్లతో కలిసి దీపావళి వేడకల్లో పాల్గొన్నారు. గురువారం దివాళి ఫెస్టివల్ సందర్భంగా ప్రధాని మోడీ జవాన్లకు మిఠాయిలు తినిపించారు. గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్‌ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) జవాన్లతో కలిసి దివాళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలోని లక్కీ నాలా వద్ద గస్తీ కాస్తున్న జవాన్లకు ప్రధాని బీఎస్‌ఎఫ్ యూనిఫాం ధరించి మిఠాయిలు తినిపించి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, ప్రతి సంవత్సరం దీపావళి పండగను పురస్కరించుకుని దేశ సరిహద్దులో జవాన్లతో కలిసి వేడుకలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

అంతకుముందు, దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. “దీపావళి సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు. ఈ దివ్య దీపాల పండుగ సందర్భంగా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషకరమైన, సంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మా లక్ష్మి, శ్రీ గణేశుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News