Monday, December 23, 2024

ఉక్రెయిన్ సంక్షోభంపై మోడీ ఉన్నత స్థాయి సమావేశం

- Advertisement -
- Advertisement -

Modi high level meeting

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భారత రక్షణ సంసిద్ధత, ఉక్రెయిన్ పోరుపై సమీక్ష జరిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేశాక ఆ యుద్ధపీడిత దేశం నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ గంగ’ పేరిట ఇటీవల చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధాని అధ్యక్షతన ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ విదేశవ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News