- Advertisement -
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బుధవారం కరోనాపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రో ధరలపై మొదటిసారి పెదవి విప్పిన ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ”బిజెపియేతర రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలి. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే డబ్బులు తగ్గుతాయి. కేంద్రం ఎక్సైట్ డ్యూటీ తగ్గించినా.. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించలేదు. తెలంగాణ, ఎపి, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రల్లో వ్యాట్ తగ్గించలేదు. వ్యాట్ తగ్గించకపోవడం వల్లే పెట్రోల్ ధరలు పెరిగాయి. రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తేనే పెట్రో ధరలు తగ్గుతాయి” అని పేర్కొన్నారు.
PM Modi comments on Fuel Price Hike
- Advertisement -