Monday, January 20, 2025

కెసిఆర్ కూతురు బాగుండాలంటే బిఆర్‌ఎస్‌కు ఓటేయ్యాలి: మోడీ

- Advertisement -
- Advertisement -

భోపాల్: సిఎం కెసిఆర్ కూతురు బాగుండాలంటే బిఆర్‌ఎస్‌కు ఓటేయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. మధ్యప్రదేశ్‌లోని రాణి కమ్లపాటి రైల్వే స్టేషన్‌లో ఐదు వందే భారత్ రైళ్లను మోడీ ప్రారంబించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. మీ కుటుంబం బాగుండాలంటే బిజెపికి ఓటేయాలన్నారు. భోపాల్ సభలో కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ విమర్శలు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సి కవితపై బిజెపి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: ఎలుగుబంటిని చంపి… భర్త, సోదరుడిని కాపాడిన మహిళ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News