Saturday, November 23, 2024

నా పార్లమెంట్..నా గర్వకారణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇప్పుడు ఆవిష్కృతం అయ్యే కొత్త పార్లమెంట్ ప్రతిభారతీయుడికి గర్వకారణం అవుతుందని ప్రధాని మోడీ శనివారం తెలిపారు. ఇది వినూత్న ప్రజాస్వామ్య దేవాలయం . దేశ ప్రగతి పథానికి , కోట్లాది ప్రజల సాధికారికతకు స్ఫూర్తి అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక నేపథ్యంలో ప్రతి భారతీయుడు ఈ పార్లమెంట్ ప్రారంభోత్సవ దశలో నా పార్లమెంట్ నాకు గర్వకారణం ( మై పార్లమెంట్ ..మై ప్రైడ్) అనే శీర్షికతో సామాజిక మాధ్యమాలలో ఆడియో రూపంలో వెలువరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఒక్కరూ తమ ట్వీటుతో పాటు ఈ కొత్త భవనం చిత్రాన్ని కూడా జతచేయాలని , పార్లమెంటరీ ప్రజాస్వామిక స్ఫూర్తిని తద్వారా దేశ ప్రగతిని మరింతగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నానికి ఈ విధంగా జనం అంతా స్పందించాలని ప్రధాని కోరారు. ఇప్పటికే తనకు కేంద్ర మంత్రి హర్దీప్ పూరి నుంచి తక్షణ రీతిలో ట్వీటు వెలువడిందని ఇటువంటి స్పందనలు కోటానుకోట్లు వెల్లువెత్తితే దేశంలో ప్రగతియుత ప్రజాస్వామ్య పటిష్టతకు తిరుగులేదని చాటుకోవచ్చునని తెలిపారు. వాయిస్ ఓవర్‌తో సందేశాలు వెలువరించాలని సూచించారు. మనందరికి గర్వకారణం అయిన విషయాన్ని మరింతగా కలిసికట్టుగా పంచుకుందామని పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News