Monday, December 23, 2024

ఆదా చేసిన సొమ్ము తోనే ఆ పథకం : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

భోపాల్ : కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయల స్కామ్‌లు జరిగాయని, బీజేపీ అధికారం లోకి వచ్చాక స్కామ్‌లు చేయకుండా ఆదా చేసిన సొమ్ముతోనే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అమలు చేస్తున్నామని ప్రధాని మోడీ వెల్లడించారు. మధ్యప్రదేశ్ లోని సివ్‌ని జిల్లాలో ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఆదా చేసిన సొమ్ము తోనే భారత్ లోని 80 కోట్ల మంది పేదలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు. దీన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగిస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల వల్లనే భారత్‌లో మొబైల్ ఫోన్లు , మొబైల్ డేటా తక్కువ ధరకే లభిస్తున్నాయని అన్నారు. జనరిక్ ఔషధ కేంద్రాల ద్వారా 80 శాతం డిస్కౌంట్‌తో ఔషధాలు విక్రయించడం వల్ల ప్రజలు సుమారు రూ. 25 వేల కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News