Thursday, January 23, 2025

పరిధి దాటే ఎఐతో ప్రమాదమే: జి20 నేతలకు మోడీ సందేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వెర్రితలలు వేస్తున్న డీప్ ఫేక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ (ఎఐ) సామాజిక హితంగా ఉండాలి. ఇది భద్రతా పరిధిని దాటితే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. పౌరుల అవసరాలను, ప్రత్యేకించి భావితరాల బాగోగులను పరిగణనలోకి తీసుకుని ఈ వినూత్న పరిజ్ఞానం వెలుగులోకి రావచ్చునని స్పష్టం చేశారు.

జి20 దేశాధినేతలతో పరోక్ష పద్ధతిలో సమావేశం అయిన సందర్భంగా ప్రధాని మోడీ వారితో ఈ డీప్ ఫేక్ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అందివచ్చే సాంకేతిక పరిజ్ఞానం ఎఐ అందరికీ చేరాల్సిందే. ఇందుకు అభ్యంతరం లేదు. కానీ ఇదే క్రమంలో దీని ద్వారా కీడు జరిగితే అది ఉపద్రవానికి దారితీస్తుందని హెచ్చరించారు. డీప్ ఫేక్ ఇప్పుడు సమస్యలు సృష్టిస్తోందని, దీనిపై పలు దేశాలు సకాలంలో స్పందించాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News