Tuesday, January 28, 2025

కెనడాలో హిందూ దేవాలయాలపై దాడి.. ప్రధాని మోడీ సీరియస్

- Advertisement -
- Advertisement -

కెనడాలోని హిందువులపై ఇటీవల ఖలిస్థానీ తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.. బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిరంపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీరియస్ అయ్యారు. కెనడాలో హిందూ దేవాలయాలు, భక్తులపై జరిగిన దాడిని ప్రధాని తీవ్రంగా ఖండించారు. ఈ మేరక ఎక్స్ లో పెస్ట్ పెట్టారు. “హిందూ దేవాలయం మీద జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇటువంటి హింసాత్మక చర్యలు భారతదేశం సంకల్పాన్ని ఎప్పటికీ బలహీనపరచవు. ఈ ఘటనపై కెనడియన్ ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని మేము ఆశిస్తున్నాము” అని మోడీ పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. కెనడాలో ఆలయంపై దాడిని ఖండిస్తూ నిరసనగా హిందూ సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. ఉత్తర అమెరికాలోని హిందూ సంఘాల ఆధ్వర్యంలో బ్రాంప్టన్‌లో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కెనడా, భారత్ జెండాలతో పలువురు నిరసనల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News