Monday, December 23, 2024

గాజాలో పౌరుల మరణాలపై ప్రధాని ఆందోళన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజాలో వేలాది మంది అమాయక పౌరులు మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు బలవుతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో సాధారణ పౌరులుప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది రెండవ సారి జరుగుతున్న ‘ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్’సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోడీ వర్చువల్‌గా పాల్గొన్నారు. భారత్ సారథ్యంలో జరుగుతున్న ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పెరుగుతున్న సవాళ్లనుఎదుర్కొనేందుకు గ్లోబల్ సౌత్ మధ్య ఐక్యత, సహకారం అవసరమన్నారు. హింస, ఉగ్రవాదానికి వ్యతిరేకమని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు.అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడులను కూడా మోడీ ఖండించారు. ఇరుదేశాల మధ్య వివాద పరిష్కారానికి సంయమనం పాటించాలని కోరారు.

యుద్ధం ఆపేసి చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ‘అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన ఉగ్రదాడిని భారత్ ఖండించింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ భారత్ సంయమనం పాటించింది. చర్చలు, దౌత్యమార్గాలద్వారానే సమస్యను పరిష్కరించేందుకు భారత్ ప్రాధాన్యత ఇస్తుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్యజరిగిన ఘర్షణలో అమాయక పౌరుల మరణాలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడిన తర్వాత పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని కూడా పంపించాం. గ్లోబల్ స‚త్‌లోని దేశాలు ప్రపంచ ప్రయోజనాల కోసం ఒకే గొంతుతో మాట్లాడాల్సిన సమయమిది’ అని ప్రధాని అన్నారు. కాగా గ్లోబల్ సౌత్ అనేది ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని దేశాల సమాహారాన్ని సూచిస్తుంది. ఇది 21వ శతాబ్దంలో మారుతున్న ప్రపంచాన్ని ప్రతిబింబించే ప్రత్యేకమైన వేదిక. దీనిలో వందకు పైగా దేశాలున్నాయి.‘

కలిసికట్టుగా, అందరి అభివృద్ధి కోసం.. అందరి నమ్మకంతో’ అనే థీమ్‌తో ఈ సారి గ్లోబల్ సౌత్ సదస్సు జరుగుతోంది. ఇక హమాస్ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడుల్లో 1400 మందికి పైగా చనిపోగా, మరో 220 మందిని కిడ్నాప్ చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై జరుపుతున్న బాంబుదాడుల్లో 11,500 మందికి పైగా చనిపోయా, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. కాగా ఇజ్రాయెల జరుపుతున్న ఈ నరమేథంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News