- Advertisement -
ఢిల్లీ: పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. మొక్కలు నాటి వాటిని జీవితాంతం రక్షించారని గుర్తు చేశారు. రామయ్య కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. వనజీవి రామయ్య మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాల మంత్రులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
- Advertisement -