Friday, December 20, 2024

రామోజీరావు మరణం పట్ల మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

ఈనాడు గ్రూప్ అధినేత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు మోడీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు.

రామోజీరావు నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నాన్నారు.  పాత్రికేయ, సినీరంగంపై ఆయన చెరగని ముద్ర వేశారని తెలిపారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని.. రామోజీరావుతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని మోడీ చెప్పారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా, హైదరాబాద్ సిటీలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజుమున 4.50 నిమిషాలకు రామోజీరావు తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News