- Advertisement -
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లో ఏరియల్ సర్వే చేపట్టారు. తౌక్టే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఏరియల్ సర్వేలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ కూడా పాల్గొన్నారు. వున్నా, డియు, జఫరాబాద్, మహువా, సౌరాష్ట్రలో తీరా ప్రాంతాలలో హెలికాప్టర్ లో ప్రధాని సర్వే చేపట్టారు. ఢిల్లీ నుంచి భువనగర్ విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకోగానే గవర్నర్ ఆచార్య దేవ్రాట్, సిఎం విజయ రుపానీ ఘన స్వాగతం పలికారు. ఈ తుఫాన్ లో 16 వేల ఇండ్లు ధ్వంసంకాగా 40 వేల చెట్లు, 70 వేల కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. 5951 గ్రామాల ప్రజల విద్యుత్ సౌకర్యం కోల్పోయారు.
- Advertisement -