- Advertisement -
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ అందుకున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ శ్రీలంక పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా శనివారం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయక.. మోదీని మిత్ర విభూషణ పురస్కారంతో సత్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డు అందుకోవడానికి ఆయన అన్ని విధాలా అర్హుడని పేర్కొన్నారు. శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం పొందినందుకు ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు దిస్సనాయకుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేశారు.
“ఇది శ్రీలంక-భారతదేశ ప్రజల మధ్య చారిత్రక సంబంధాన్ని, లోతైన స్నేహాన్ని చూపిస్తుంది. దీనికి నేను శ్రీలంక ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని ఆయన అన్నారు.
- Advertisement -