Sunday, February 23, 2025

లూనార్ లాండింగ్ విజయప్రదంపై జపాన్‌కు మోడీ అభినందనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అంతరిక్ష పరిశోధనల్లో జపాన్ అంతరిక్ష సంస్థ “జాక్సా” కు సహకరిస్తూ కలిసి ముందుకు సాగడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చూస్తోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. చంద్రునిపై లూనార్ లాండింగ్ విజయవంతం కావడంపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాను అభినందించారు. చంద్రుని ఉపరితలంపై జపాన్ స్మార్ట్ లాండర్ కాలుమోపడం జపాన్ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ప్రధానమైన మైలురాయి వంటిదని మోడీ అభివర్ణించారు. తన ఎక్స్ వేదికగా మోడీ అభినందనలను జపాన్‌కు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News