- Advertisement -
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కింది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ అంతర్జాతీయంగా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. ఆ భారీ బడ్జెట్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించారు. ఎంఎం కీరవాణి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. ఇవాళ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న కీరవాణి బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ్, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్‌లకు అభినందనలు చెబుతున్నానన్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్‌లకు కూడా కంగ్రాట్స్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ టీమ్‌ని కూడా అభినందిస్తున్న అన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందని ప్రధాని మోదీ అన్నారు.
- Advertisement -