Sunday, January 5, 2025

పారా అథ్లెట్లకు ప్రధాని మోడీ అభినందనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ ఇప్పటికే 20 పతకాలను సాధించి నయా చరిత్ర సృష్టించింది. షూటింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ తదితర విభాగాల్లో భారత ఆటగాళ్లు అసాధారణ ఆటతో పతకాల పంట పండిస్తున్నారు. చారిత్రక ప్రదర్శనతో దేశ ఖ్యాతిని ఇనుమడింప చేసిన పారా అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు.

ఈ సందర్భంగా మోడీ పారా అథ్లెట్లతో ప్రత్యేకంగా ఫోన్‌లో మాట్లాడారు. పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. అంచనాలకు మించి రాణించిన అథ్లెట్ల ప్రతిభను ఎంత పొగిడినా తక్కువేనని కొనియాడారు. ప్రస్తుతం ప్రధాని బ్రూనైలో పర్యటిస్తున్నారు. బ్రూనైలో అధికారిక సమావేశాలు ముగిసిన అనంతరం ప్రధాన మంత్రి ప్రత్యేకంగా సంభాషించారు. పారిస్ క్రీడల్లో అసాధారణ ప్రతిభతో పతకాలు సాధించిన అథ్లెట్లు దీప్తి జీవాంజి, మరియప్పన్ తంగవేలు. సుందర్ సింగ్, శరద్ కుమార్ తదితరులను అభినందిస్తూ ప్రధాని ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News