Friday, December 20, 2024

భారత్, రష్యా బంధం పటిష్ఠం: పుతిన్‌కు ప్రధాని మోడీ అభినందన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైనందుకు అభినందించారు. భారత్, రష్యా ‘ప్రత్యేక, గర్వకారక వ్యూహాత్మక భాగస్వామ్యం’ విస్తరణ దిశగా ముమ్మరంగా కృషి చేయడానికి తమ టెలిఫోన్ సంభాషణలో ఉభయ నేతలూ అంగీకరించారు.

రష్యా అధ్యక్షునితో తన సంభాషణను ‘ఎక్స్’లో ప్రధాని మోడీ పంచుకుంటూ.. ‘అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడి, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా తిరిగి ఎన్నికైనందుకు ఆయనను అభినందించా. రానున్న సంవత్సరాలలో భారత్, రష్యాప్రత్యేక, గర్వకారక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢం చేసేందుకు, విస్తరించేందుకు కలసి పని చేయాలని మేము అంగీకరించాం’ అని తెలియజేశారు. అంతకు ముందు సోమవారం రష్యాఅధ్యక్షుడుగా తిరిగి ఎన్నికైన పుతిన్‌ను ప్రధాని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో అభినందించారు. భారత్, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రజల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లు మోడీ తెలిపారు.

‘రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా తిరిగి ఎన్నికైనందుకు వ్లాదిమిర్ పుతిన్‌కు మనఃపూర్వక అభినందనలు’ అని ప్రధాని మోడీ తన‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. పుతిన్ ఆదివారం అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించారని. ఎలక్టొరల్ ప్రొటోకాల్స్ ప్రాసెసింగ్ ఫలితంగాఆయనకు 87.17 శాతం వోట్లు వచ్చాయని రష్యన్ ఫెడరేషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ డేటాను ఉటంకిస్తూ రష్యా కేంద్రంగా గల టాస్ వార్తా సంస్థ తెలియజేసింది. రష్యన్ ఫెడరేషన్ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి నికొలాయ్ ఖరితొనోవ్ 4.1 శాతం వోట్లతో రెండవ స్థానం పొందగా న్యూ పీపుల్ పార్టీ అభ్యర్థి వ్లాదిస్లావ్ దవన్‌కోవ్ 4.8 శాతం వోట్లతో మూడవ స్థానంలో నిలిచారు.

లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ రష్యా (ఎల్‌డిపిఆర్) అభ్యర్థి లియోనిద్ స్లట్‌స్కీకి కేవలం 3.15 వాతం వోట్లు వచ్చాయి. పుతిన్‌కు 2018 ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ వోట్లు లభించాయి. 2018లో ఆయనకు మొత్తం వోట్లలో 76.69 శాతం వోట్లు వచ్చాయి. ఇతర అభ్యర్థుల ప్రదర్శన కూడా 2018లోని పుతిన్ ప్రత్యర్థుల కన్నా తక్కువేనని వార్తలు సూచించాయి. కాగా, రష్యాలో అధ్యక్ష ఎన్నికలలో రిమోట్ ఎలక్ట్రానిక్ వోటింగ్‌ను మొదటిసారిగా వినియోగించారు. పుతిన్ రష్యా అధ్యక్షుడుగా నాలుగు పదవీ కాలాలు పూర్తి చేశారు. ఆయన తొలిసారి 2000లో అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆయన తిరిగి 2004, 2012, 2018లో ఎన్నికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News