వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంగళవారం మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. తన నామినేషన్ పత్రాలను కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు. ఈ సందర్భంగా తన మొత్తం ఆస్తుల విలువను మోడీ వెల్లడించారు. తనకు కారు, ఇల్లు, భూమి ఏవీ లేవని తెలిపారు.
మోడీ ఎన్నికలడవిట్ ప్రకారం అఫి.. ప్రధాని మోడీకి మొత్తం రూ.3.02 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో రూ.2.86 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్లు.. గాంధీనగర్, వారణాసిలోని రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.80,304 ఉన్నాయి. చేతిలో 52,920 నగదు ఉంది. రూ.2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి.
2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రధాని మోడీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.11 లక్షల నుండి 2022-23 నాటికి రూ23.5 లక్షలకు రెట్టింపు అయిందని నామినేషన్ పత్రాలు వెల్లడించారు.
మోడీ విద్యాభ్యాసం విషయానికొస్తే.. 1978లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1983లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు. తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని చెప్పారు.