Wednesday, January 22, 2025

సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని

- Advertisement -
- Advertisement -

PM Modi dedicated solar power project to the nation

‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో
100 మెగావాట్ల నీటిపై తేలియాడే
సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో
‘ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్’ కార్యక్రమంలో
వినియోగదారులతో మాట్లాడిన ప్రధాని

హైదరాబాద్: రామగుండం ఎన్టీపిసి జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం జాతికి అంకితం చేశారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో ‘ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులను ఉద్ధేశించి ఆయన వర్చువల్ వేదికగా ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యుదీకరణ అనంతరం దేశ ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులపై హిమచల్ ప్రదేశ్, త్రిపుర, విశాఖపట్నం, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వాసులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన రామగుండం 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుతో పాటు కేరళలోని 92 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకింతం చేశారు.

అదేవిధంగా రాజస్థాన్‌లో 735 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, గుజరాత్‌లోని హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లకు ఆయన వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. రామగుండం ఎన్టీపిసి జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టు ద్వారా సాధారణ సమయంలో ఎండకు రోజుకు 5 లక్షల యూనిట్‌ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా దాదాపు 2 లక్షల యూనిట్లను గోవా రాష్ట్రానికి అందిస్తుండగా మిగతా 3 లక్షల యూనిట్లను విఫణికి సరఫరా చేస్తున్నారు. 40 బ్లాక్ నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాక్‌లో 2.5 మెగావాట్ల సామర్థంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. హెచ్‌డిపిఈ (హై డెన్సిటీ పాలిఇథలిన్)తో తయారు చేసిన ప్లోటర్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జూలై 01వ తేదీ నుంచి 100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News