ఢిల్లీ: బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రెండు రోజుల పాటు ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నారు. మంగళవారం కజాన్‌లో జరుగనున్న 16వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనున్నారు.”కేవలం గ్లోబల్ డెవలప్‌మెంట్, భద్రత కోసం బహుపాక్షికతను బలోపేతం చేయడం” అనే థీమ్‌తో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. కీలక ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి, బ్రిక్స్ దేశాలను ఏకం చేయడానికి ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
కాగా, రేపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పాటు ఇతర బ్రిక్స్ నేతలతో కూడా ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచ కల్లోలం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.