Sunday, January 19, 2025

ఒకే యూనిఫాం అసాధ్యం

- Advertisement -
- Advertisement -

PM Modi discusses one nation one police

పోలీసు బలగాల అభిప్రాయం

న్యూఢిల్లీ : దేశంలోని వివిధ పోలీసు బలగాలకు ఒకే యూనిఫాం అనే ప్రధాని సూచన అంత తేలికైనది కాదని పోలీసు బలగాల్లోని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. వివిధ బలగాలకు ప్రత్యేక గుర్తింపు అవసరం. వారి ఉనికి విభిన్నంగా ఉండాల్సిందే. అంతేకాకుండా దేశంలోని వేర్వేరు వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుంది. దేశంలోని వైవిధ్యతను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి చూస్తే ఈశాన్యభారతంలో అత్యంత శీతల వాతావరణం ఉంటుంది. రాజస్థాన్‌లో వేడిమి, దక్షిణాదిలో తేమ, ఇక్కడ కూడా వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు పరిస్థితులు ఉంటాయని,ఈ క్రమంలో ఒకే విధమైన యూనిఫాం ఇబ్బందికరం అవుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా బలగాలను వారి యూనిఫాంలను బట్టి గుర్తించే ప్రక్రియ నిష్ప్రయోజనకర ప్రయోగం అవుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ డిజి ర్యాంక్ పోలీసు అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News