ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్కూబా డైవింగ్ చేశారు. ద్వాపరయుగంనాటి ద్వారకా నగరాన్ని సందర్శించేందుకు ఆయన ఈ సాహసం చేశారు. గతంలో లక్షద్వీప్ వద్ద స్కూబా డైవింగ్ చేసిన ప్రధాని, ఈసారి డైవింగ్ సూట్ ధరించి, అరేబియా సముద్రతీరంలోని బెట్ ద్వారక ద్వీపం వద్ద నీటిలోకి దిగి, సముద్ర గర్భానికి వెళ్లి శిథిల ద్వారకా నగర అవశేషాల వద్ద పూజలు జరిపారు.
ఆ తర్వాత ఆయన తన డైవింగ్ అనుభవాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ద్వారకలో పూజలు చేయడం దివ్యమైన అనుభూతినిచ్చిందన్నారు. శ్రీకృష్ణ భగవానుడు అందరినీ అనుగ్రహిస్తాడని ఆయన పేర్కొన్నారు. తన స్కూబా డైవింగ్ కు సంబంధించిన పలు ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
विकास भी, विरासत भी!
गहरे समंदर में जाकर भारत की महान विरासत प्राचीन द्वारका जी के दर्शन करते पीएम मोदी। pic.twitter.com/U6eZLRAYz9
— BJP (@BJP4India) February 25, 2024