- Advertisement -
లఢఖ్: దేశ సైనికులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ప్రధాని మోడీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కార్గిల్ లో జవాన్లతో కలిసి ప్రధాని దీపావళి వేడుకలను జరుపుకుంటున్నారు. సైనికులకు ప్రధాని మోడీ స్వీట్లు పంచి శుభాకాంక్షలు చెప్పారు. జవాన్లతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ”జవాన్లందరూ నా కుటుంబ సభ్యులే. సైనికులు దేశాన్ని కాపాడే రక్షణ స్తంభాలు. దేశ సైనికుల శౌర్యం అనంతం. జవాన్లతో కలిసి పండుగ జరుపుకోవడం గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు.
PM Modi Diwali Celebrations with Soldiers in Kargil
- Advertisement -