Monday, December 23, 2024

ఢిల్లీలో ఉండి.. స్వీడన్‌లో కారు నడిపిన మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi drove a car in Sweden sitting in Delhi

న్యూఢిల్లీ : మానవ జీవితంలో 5జీ సాంకేతిక తీసుకువచ్చే అనూహ్యమైన మార్పును ప్రధాని మోడీ స్వయంగా అనుభూతి పొందారు. శనివారం ఈ కొత్త సేవలకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఢిల్లీలో 5జీ లింక్‌ను ఉపయోగించి కారు నడిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో భాగంగా ఎరిక్‌సన్ కేంద్రం నుంచి స్వీడన్‌లో కారును నియంత్రించారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ ట్విటర్‌లో షేర్ చేశారు. భారత్ ప్రపంచాన్ని నడిపిస్తోంది. ప్రధాని మోడీ 5 జీ సాంకేతికతను ఉపయోగించి స్వీడన్‌లో కారు నడిపి చూశారుఅని రాసుకొచ్చారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో 6 వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని … దీంతో పాటు 5 జీ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను మోడీ ఆసక్తిగా తిలకించారు. ఈ సేవల సామర్ధానికి సంబంధించిన డెమోను రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు 5 జీ టెక్నాలజీ శ్రీకారం చుట్టబోతోందన్నారు. 21వ శతాబ్దంలో ఇది చరిత్రాత్మకమైన రోజని అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News