న్యూఢిల్లీ: ఐఐటి అంటే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రమే కాదని, ఐఐటి అంటే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండిజీనియస్ టెక్నాలజీగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఐఐటి ఖరగ్‌పూర్ 66వ స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. ఆన్ లైన్ ద్వారా డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వైద్య, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 21వ శాతాబ్దపు భారతదేశం పూర్తిగా మారిపోయిందని ప్రధాని తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం, స్వీయ అవగాహన పెంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, నిస్వార్థత, స్వీయ అవగాహనపై దృష్టిపెటాలని విద్యార్థులకు సూచించారు. కరోనాపై పోరులో ఐఐటిల సాంకేతికత ఉపయోగపడిందన్న ప్రధాని, ప్రజల జీవితాలు మార్చేందుకు విద్యార్థులు అంకురాలుగా పనిచేయాలని తెలిపారు.
PM Modi during 66th Convocation of IIT Kharagpur