Wednesday, December 25, 2024

సిబిఐ, ఈడీ నామీద పనిచేయవని మోడీకి అర్థమైంది : రాహుల్

- Advertisement -
- Advertisement -

PM Modi ED-CBI do not scare me Says Rahul gandhi

న్యూఢిల్లీ : తనపై సీబీఐ, ఈడీలు పనిచేయబోవని ప్రధాని నరేంద్రమోడీకి అర్థమైపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం చెప్పారు. ఆయన అహంకారాన్ని చూసి నవ్వుకుంటున్నానని తెలిపారు. మోడీ బుధవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రస్తావించారు. ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ మోడీ రాహుల్ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలకు సంబంధిత శాఖలు వివరణ ఇచ్చాయని తెలిపారు. సభలో కూర్చొనని, వినని వ్యక్తికి తాను ఎలా సమాధానం చెప్పగలనని ప్రశ్నించారు. పార్లమెంటులో తన ప్రసంగాన్ని రాహుల్ గుర్తు చేస్తూ మోడీ సృష్టిస్తున్న రెండు భారత దేశాల గురించి తాను మాట్లాడానని , ఒక బారతదేశం పారిశ్రామిక వేత్తల కోసం, మరో భారత దేశం పేదలు, నిరుద్యోగుల కోసం అని తాను చెప్పానని వివరించారు. మొదటిదానిలో పారిశ్రామిక వేత్తలకు ఏది కావాలంటే అది దొరుకుతుందన్నారు. తాను చైనా గురించి కూడా మాట్లాడానన్నారు.

పార్లమెంటులో మోడీ చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ గురించి తప్పులు మాట్లాడారన్నారు. ఎప్పటి మాదిరిగానే తన గురించి కూడా మాట్లాడారన్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేయడం తప్పు అంటున్నారన్నారు. తాము అధికారంలో లేమని, నరేంద్రమోడీ తన పని తాను చేయరని అన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ప్రజలను నిరుద్యోగులుగా మార్చారన్నారు. “రాహుల్ గాంధీ వినడని మోడీ అన్నారు. దీని అర్థం ఏమిటంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) , కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాహుల్ గాంధీపై పనిచేయబోవని ఆయనకు అర్థమై పోయింది. అదే ఆయన భావం” అన్నారు. “ ఔను అయన చెప్పింది నిజమే. మోడీ మాటలను రాహుల్ గాంధీ వినడు. తాను అందరినీ ఈడీ, సిబిఐలతో బెదిరించగలనని ఆయన భావిస్తున్నారు. నేను భయపడను. ఆయన గర్వాన్ని చూసి నేను నవ్వుకుంటాను” అని చెప్పారు. “ మోడీ మాటనేనెందుకు వినాలి” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News