Sunday, December 22, 2024

రేపు శ్రీనగర్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ర్యాలీ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రసంగించనున్న ఎన్నికల ర్యాలీకి ముందుగా శ్రీనగర్‌లోని షేర్ ఎ కాశ్మీర్ పార్క్ పరిసరాల్లో పలు అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. ఈ నెల చివర్లో కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాశ్మీర్‌లో బిజెపి అభ్యర్థుల తరఫున మోడీ ప్రసంగించనున్న తొలి ర్యాలీ ఇది. ‘అటువంటి సభల కోసం నిర్దేశించిన ప్రామాణిక నిర్వహణ నియమావళి (ఎస్‌ఒపి)ప్రకారం, వివిఐపి పర్యటన కోసం పలు అంచెల భద్రత ఏర్పాట్లు చేశాం’ అని పోలీస్ ఐజి వికె బిర్ది మంగళవారం వెల్లడించారు. సభ వేదిక విశిష్ట లాల్ చౌక్ క్లాక్ టవర్‌కు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. పోలీసులు తగిన ఏర్పాట్లు చేసినట్లు బిర్ది తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News