Wednesday, January 22, 2025

21 ఏళ్లనాటి అనుభవ స్మృతి.. అప్పటి విద్యార్థి ఇప్పటిమేజర్

- Advertisement -
- Advertisement -

PM Modi emotional meeting with Army officer

మోడీని కలిసిన ఆనంద క్షణాలు..

న్యూఢిల్లీ : సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం ఓ గుజరాత్ విద్యార్థి తన స్కూల్లో నరేంద్రమోడీని చూశారు. ఇప్పుడు అదే విద్యార్థి మళ్లీ మేజర్‌హోదాలో మోడీని కలుసుకోవడం అతని ఆనందానికి అవధుల్లేవు.. ఈ ఉద్వేగభరిత సమ్మేళనానికి కార్గిల్ వేదికైంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ సోమవారం కార్గిల్‌కు వెళ్లారు. జవాన్లతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ ఆర్మీ అధికారి మేజర్ అమిత్ ప్రధానికి ఓ ఫోటోను బహూకరించారు. 2001లో మోడీ చేతుల మీదుగా అమిత్ షీల్డు అందుకున్న ఫోటో అది. గుజరాత్ సిఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2001 అక్టోబర్‌లో మోడీ జామ్‌నగర్‌లోని బాలాచది సైనిక్ స్కూలును సందర్శించారు.

అదే స్కూలులో అమిత్ చదువుకున్నారు. మోడీ చేతుల మీదుగా అమిత్, మరో విద్యార్థి షీల్డ్ అందుకున్నారు. ఆ ఫోటోను అమిత్ భద్రంగా దాచుకున్నారు. ఇప్పుడు ప్రధాని కార్గిల్‌కు వస్తున్నారని తెలిసి ఆ ఫోటోను ప్రధానికి బహుమతిగా అందించారు. ఇన్నేళ్ల తరువాత మేజర్ హోదాలో అమిత్ కార్గిల్‌లో ప్రధానిని కలిశారని, ఒకింత భావోద్వేగానికి గురయ్యారని ఆర్మీ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రధాని దీపావళి వేడుకలను దేశ సరిహద్దుల్లో జవాన్లతో కలసి జరుపుకొంటున్నారు. ఈ సారి కార్గిల్ వెళ్లి అక్కడి సైనికులతో గడిపారు. వారికి స్వయంగా మిఠాయిలు తినిపించారు. తరువాత జవాన్లతో కలిసి వందేమాతరం ఆలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News