Monday, December 23, 2024

సిద్ధాంతాలు భిన్నమైనా నటులను కలిశాను:ప్రధాని మోడీ వెల్లడి

- Advertisement -
- Advertisement -

సినీ కళాకారులకు భిన్నమైన సైద్ధాంతిక భావనలు ఉండి ఉండవచ్చునని, అయినప్పటికీ వారితో తాను జరిపిన భేటీల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ‘ఐఎఎన్‌ఎస్’ ప్రత్యేక ఇంటర్వూలో మాట్లాడారు. ప్రపంచ చిత్రపటంపై భారత్‌ను నిలపగల సినిమా శక్తిని సద్వినియోగం చేసుకోవాలని తాను వాంఛించానని ప్రధాని మోడీ తెలిపారు. ‘ప్రధాని పదవిని అధిష్ఠించిన తరువాత పెక్కు వర్క్‌షాప్‌లు నిర్వహించాను. 2015, 2016 ప్రాంతంలో స్టార్టప్‌లతోను, క్రీడాకారులతోను వర్క్‌షాప్‌లు జరిపాను. కేవలం ఇది కాదు.

చలనచిత్ర రంగానికి చెందినవారితోనూ సమావేశాలు జరిపాను’ అని మోడీ తెలియజేశారు. చలనచిత్ర రంగ సభ్యుల సిద్ధాంతాల గురించి తనకు తెలుసునని, వారి ఆలోచన సరళులు తనకు, బిజెపికి చెందినవారికి భిన్నంగా ఉంటాయని, అయినప్పటికీ సినిమా ద్వారా ప్రపంచంలో వృద్ధి చెందుతున్న శక్తిగా దేశాన్ని నిలబెట్టేందుకు వారితో సహకరించానని మోడీ తెలిపారు. గేమింగ్ రంగం గురించి కూడా ప్రస్తావించిన ప్రధాని మోడీ క్రితం నెల టాప్ యువ గేమర్లు కొందరిని కలుసుకున్నానని చెప్పారు. మన కోసం భారీ గేమింగ్ మార్కెట్ వేచి చూస్తున్నదని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News