- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం ఆదర్శాలను పరిరక్షించడానికి, సంపన్న భారతదేశం కోసం కృషి చేయడానికి ప్రయత్నాలను బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తూ, 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
“గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం గణతంత్ర రాజ్యంగా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగాన్ని రూపొందించి, ప్రజాస్వామ్యం, గౌరవం, ఐక్యతతో మన ప్రయాణం సాగేలా చేసిన మహనీయులందరికీ ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నా. మన రాజ్యాంగం ఆదర్శాలను పరిరక్షించడం, బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించేందుకు మా ప్రయత్నాలకు ఈ వేడుక బలం చేకూరుస్తుందని ఆశిస్తున్నా” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
- Advertisement -