న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో వరుసగా నాలుగవ విడ త 2029లో అధికారంలోకి తిరిగి వస్తానని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ధీమా వ్యక్తం చేశారు. ప్ర ధాని మోడీ తన విమర్శకులకు ఆవిధంగా జవాబు చెప్పారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బిజె పి సొంతంగా ఆధిక్యం సాధించకపోవడంతో తన ప్ర తిభ మసక బారిందని రాజకీయ పండితులు కొంద రు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఫిన్‌టెక్ పరిశ్రమ అధినేతల సమావేశంలో ప్రసంగిస్తూ, 2029లో వారి పదవ వార్షిక కార్యక్రమంలోనూ పా ల్గొంటానని చెప్పారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సొంతంగా మెజారిటీ సాధించింది. కా నీ, 2024 ఎన్నికల్లో పార్టీకి సాంతంగా ఆధిక్యం సా ధించేందుకు కావలసిన 272 మంది ఎంపిలు గెలవలేదు. దానితో ప్రభుత్వం ఎన్‌డిఎలోని ఇతర భాగస్వామ్య పక్షాల మద్దతుపై ఆధారపడుతోంది.
తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2029 ఏప్రిల్‌మేలో జరగవలసి ఉన్నాయి. ‘ఇది గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ ఐదవ ఎడిషన్. నేను పదవ ఎడిషన్‌లోనూ వస్తాను’ అని మోడీ చెప్పారు. వార్షిక సదస్సు 2020లో మొదటైం ది. పదవ ఎడిషన్ 2029లో జరుగుతుంది. ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ, భార త ఫిన్‌టెక్ పురోగతిపై అనేక మంది భయాందోళన లు వ్యక్తం చేశారని, గ్రామలకు ఇంటర్నెట్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ ఉండవని ఆరోపించారు. ‘విజ్ఞాన దేవత సరస్వతీ మాత విజ్ఞత గరపుతుండగా, స్వ యం ప్రకటిత నిపుణులు కొందరు అప్పుడే సందేహాలు లేవనెత్తుతున్నారు. ఫిన్‌టెక్ విప్లవం ఎలా సంభవిస్తుందని వారు ప్రశ్నించారు& నా వంటి ఒక ‘చాయివాలా’ ఒకరిని కూడా వారు ప్రశ్నిస్తుంటారు’ అని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ కేవలం ఒక దశాబ్దంలో భారత్ గణనీయమైన పరివర్తనను చూసిందని మోడీ చెప్పారు.