Sunday, January 19, 2025

మైనారిటీలకు బడ్జెట్‌లో 15 శాతం వాటా ఇవ్వాలట

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ గతంలో పాలించినపుడు మైనారిటీల కోసం ప్రభుత్వ బడ్జెట్‌లో 15 శాతం కేటాయించాలని భావించిందని, అయితే బడ్జెట్‌ను విభజించడానికి కాని మత ప్రాతిపదికన ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించడానికి తాను అమనుమతించబోనని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోగల పింపల్‌గావ్ వద్ద బుధవారం ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగిస్తూ మతం పేరిట బడ్జెట్‌ను విభజించడం ప్రమాదమని అన్నారు. ఉద్యోగాలు, విద్యలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గట్టిగా వ్యతిరేకించారని మోడీ చెప్పారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ ఈ ప్రతిపాదన తీసుకువచ్చిందని, దీన్ని బిజెపి గట్టిగా వ్యతిరేకించడంతో అది అమలు కాలేదని మోడీ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనను మళ్లీ తీసుకురావాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా ఆయన చెప్పారు.’

మత ప్రాతిపదిక రిజర్వేషన్లను అంబేద్కర్ వ్యతిరేకిస్తే ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిల రిజర్వేషన్ల హక్కులను లాక్కుని వాటిని ముస్లింలకు కట్టబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆయన ఆరోపించారు. సమాజంలోని అణగారిన వర్గాల హక్కులకు మోడీ చైకీదార్(కాపలాదారు) అని ఆయన ప్రకటించారు. వారి హక్కులను లాక్కోవడానికి కాంగ్రెస్‌కు ఎప్పటికీ అనుమతించబోమని ఆయన చెప్పారు. దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునే ప్రధానమంత్రిని ఎన్నుకోవడం గురించి ఈ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. గత పదేళ్లలో తన ప్రభుత్వం మతాలకు అతీతంగా అందరికీ ఉచిత రేషన్, మంచీనరు, విద్యుత్, ఇళ్లు, గ్యాస్ కనెక్షన్లు అందచేసిందని మోడీ తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి కోసం రూపొందించినవని ఆయన తెలిపారు. ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోతుందని మమహారాష్ట్రకు చెందిన ఇండియా కూటమి నాయకుడు ఒకరిని తెలుసునని

, అందుకే చిన్న పార్టీలన్నీ కాంగ్రెస్‌లో విలీనం కావాలని సూచించారని మోడీ వ్యాఖ్యానించారు. కనీసం ఈ రకంగానైనా కాంగ్రెస్ ప్రతిపక్షంగా నిలబడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. నకిలీ శివసేన(ఉద్ధవ్ థాక్రే) కాంగ్రెస్‌లో విలీనమైతే తాను బాలాసాహెబ్ థాక్రేను గుర్తు చేసుకుంటానని, అయోధ్యలో భవ్యమైన రామాలయాన్ని, జమ్మూ కశ్మీరులో 370 అధికరణ రద్దు గురించి ఆయన కలలు కన్నారని మోడీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News