Thursday, January 23, 2025

కాంగ్రెస్ వల్లే అల్లర్లు: మోడీ ధ్వజం

- Advertisement -
- Advertisement -

జైపూర్ : కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌లో తన నేతల బుజ్జగింపు విధానాలతో అవినీతి, నేరాలు, అల్లర్లలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేలా తయారు చేసిందని ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భరత్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో మోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ను లక్షంగా చేసుకుని రాజస్థాన్ ప్రజలు ‘జాదూగర్’ (మంత్రగాడు)కు ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారని, ఎన్నికల తరువాత డిసెంబర్ 3న కాంగ్రెస్ మాయమౌతుందని ధ్వజమెత్తారు.

రాజకీయాల్లోకి రాకముందు మాంత్రిక వృత్తిదారుని కుమారుడైన గెహ్లాట్ మ్యాజిక్ ట్రిక్కులు చేసుకుంటూ దేశమంతా తిరిగేవారని వ్యక్తిగతంగా విమర్శించారు. ఒకవైపు భారత్ ప్రపంచానికి ఒక నాయకుడిగా ఎదుగుతుంటే రాజస్థాన్‌లో మాత్రం అల్లర్లు, అవినీతి పెచ్చుమీరి పోయాయని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాజస్థాన్‌లో గత ఐదేళ్లలో ప్రజలు హోలీ, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వంటి పండగలు కూడా శాంతియుతంగా జరుపుకోలేక పోయారని విమర్శించారు. మహిళలు తప్పుడు అత్యాచార కేసులు పెడతారని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అంటున్నారని, అలాంటి వ్యక్తికి ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే హక్కుందా ? అని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News