కుటుంబ పాలనతో దేశానికి నష్టం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. తాను, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ వారసత్వ రాజకీయాలు చేయలేదన్నారు. వారసులు రాజకీయాల్లోకి వస్తే మంచిదే.. కానీ వారి చేతుల్లోకి పార్టీలు వెళ్లడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల కారణంగా అజాద్ ఆ పార్టీని వీడారని మోదీ అన్నారు. కుటుంబ రాజకీయాలు చేసే వారికి సవాల్ విసురుతున్నా.. వారసులకు కాకుండా కార్యకర్తలకు అవకాశం ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
దేశంలో మేము నాలుగు కోట్ల మంది పేదలకు ఇండ్లు ఇచ్చామని.. 17 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చామన్నారు మోదీ. దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద అర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దే బాధ్యత తనదేనన్నారు. ఎవరేమనుకున్నా మేము మూడోసారి అధికారంలోకి వస్తామని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వందేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని.. మేము పదేండ్లలోనే చేశామని మోడీ చేప్పారు..