Friday, December 20, 2024

ఆర్థికవృద్ధిలో తెలంగాణ ప్రధాన భూమిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/వరంగల్ క్రైం/ హన్మకొండ: దేశాభి వృద్ధిలో తెలంగాణ ప్రాంతం కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా స హకరిస్తుందని స్పష్టం చేశారు. శనివారం వరంగల్ పర్యటనకు వ చ్చిన ప్రధాని మోడీ హన్మకొండలోని ఆర్ట్‌కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభ వేదికగా పలు అభివృద్ధి కార్య క్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ప్రధాని ప్రసంగించా రు. తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు అంటూ తెలుగులో ప్రా రంభించారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిందన్నారు. ఆర్థి కవృద్ధిలోనూ తెలంగాణ ప్రధాన
భూమిక పోషిస్తోందన్నారు. దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని చెప్పారు. దేశాభివృద్ధి కోసం అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నామని, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు,

ఇండస్ట్రియల్-ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని, కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నామని పేర్కొన్నారు. కీ బార్ బిజెపి సర్కార్ రావాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మోడీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోందన్నారు. ఇక్కడి ప్రభుత్వ అవినీతి ఢిల్లీ వరకూ పాకిందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే బిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మోడీ విమర్శించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. యువతను మోసం చేసింది. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారు. టిఎస్‌పిఎస్‌సి స్కామ్ ద్వారా యువతను మోసం చేసింది.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 3 వేల అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలల్లో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులకు ద్రోహం చేశారని ప్రధాని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని, రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీలను పత్తాలేకుండా చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై సర్పంచ్‌లు ఆగ్రహంతో ఉన్నారని మోడీ ఆరోపించారు. పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తోందని, 9 ఏళ్లలో కేంద్రం రూ. లక్ష కోట్లకుపైగా నిధులిచ్చిందని చెప్పారు. మద్దతు ధర ఇస్తామని. ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు. ‘ తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇచ్చాం. ఆదివాసీ గ్రామాలకు రాష్ట్రం ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించట్లేదు. మేం ఆదివాసీ ప్రాంతాల్లో ఆరులైన్ల రహదారులను కేంద్రం వేస్తోందన్నారు.

* మౌలిక సదుపాయలకు ప్రాధాన్యత : గడ్కరీ
కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. లక్షా పదివేల కోట్ల ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు.

* 3 వేల కుటుంబాలకు లబ్ధి : కిషన్‌రెడ్డి
కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణంతో 3 వేల ఉద్యోగాలు వస్తాయి కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదన్నారు. రాష్ట్రప్రభుత్వం సహకరించకపోయినా.. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం అండగా నిలుస్తూ భారీ ప్రాజెక్టులు కేటాయిస్తున్న మోడీకి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలను ఆయన తెలిపారు. మజ్లీస్ పార్టీ తో కిలిసి గుండాయిజం, రౌడీయిజాన్ని బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని అన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

* ప్రపంచమే బాస్‌గా గుర్తించిన నేత మోడీ: బండి
ప్రపంచమే బాస్‌గా గుర్తించిన నేత ప్రధాని నరేంద్ర మోడీ’ అని బిజెపి మాజీ అధ్యక్షుడు బండి ‘సంజయ్ అన్నారు. ప్రధాని కార్యక్రమానికి వచ్చేందుకు బిఆర్‌ఎస్‌కు ముఖం లేదన్నారు. పార్టీ తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సహా అనేక అవకాశాలు కల్పించిందని ఆయన అన్నారు. కెసిఆర్ గడీలు బద్దలు కొడతాం.. -తెలంగాణలో కాషాయ రాజ్యం స్థాపిస్తామని బండి సంజయ్ మాట్లాడారు.

* బంగారు తెలంగాణ సత్తా బిజెపికే ఉంది : ఈటల
వరంగల్ గడ్డమీద రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి శ్రీకారంతో తెలంగాణ జిల్లాలకు శుభసూచికమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణకు భరోసాగా ఉన్నామని చెప్పేందుకే ప్రధాని వచ్చారన్నారు. కెసిఆర్‌ను గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారు. హామీలు ఇచ్చి ప్రజల కళ్లలో మట్టికొట్టిన బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలి. బంగారు తెలంగాణ పేరిట కెసిఆర్ మాటలు చెప్పారు. బంగారు తెలంగాణ చేతల్లో చేసి చూపించే సత్తా బిజెపికే ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News