Tuesday, January 21, 2025

తొలి సంతకం చేసిన మోడీ.. రైతులకు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు పడనున్నాయి. సౌత్ బ్లాక్ పీఎంవో కార్యాలయంలో మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రధాని మోడీ తొలి సంతకం చేశారు. 17వ విడత పిఎం కిసాన్ నిధులను విడుదల చేస్తూ మోడీ ఫైల్‌పై సంతకం చేశారు.

దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో దేశంలోని 9 కోట్ల 30 వేల మంది రైతుల ఖాతాల్లో.. ఒక్కక్కొరికి రూ.2 వేల చొప్పున డబ్బులు పడనున్నాయి.  రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని.. రైతుల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఈ సందర్భంగా మోడీ చెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News