Tuesday, January 21, 2025

విదేశీ గడ్డ మీదుగా విద్వేష విషం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : విద్వేష పూరిత వ్యక్తులు అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ పరువు తీసేందు కు తెగిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అసూయ ద్వేషం, ప్రతికూలత మేళవించుకున్న కొందరు తెరపైకి వచ్చారు. వీరు సందు దొరికినప్పుడు, వేదిక చిక్కినప్పుడల్లా దే శాన్ని దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారని మోడీ స్పందించారు. సోమవారం ప్రధాని మో డీ స్వరాష్ట్రం గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ దశలో భుజ్ అహ్మదాబాద్ మధ్య నడిచే వందేభారత్ మెట్రో రైలుకు ప్రారంభోత్సవ సభలో మాట్లాడారు. ఈ మెట్రో రైలుకు నమో భారత్ రాపిడ్ రైలు అని పేరు పె ట్టారు. ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూ డా మోడీ వర్చువల్‌గా ఇక్కడి నుంచే ఆరంభించారు. ఈ క్రమంలో మోడీ తమ ఘాటైన ప్ర సంగంలో పరోక్షంగా కాంగ్రెస్ ఎంపి, నేత రా హుల్ గాంధీపై తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రతిపక్షాలకు కేవలం సొంత రాజకీయ స్వా ర్థం తప్పితే దేశం పట్ల ఎటువంటి బాధ్యత లేద ని, ఈ విషయం ఇటీవల విదేశాలలో పలు వేదికల నుంచి పార్టీల నేతలు చేస్తున్న ప్రసంగాల క్రమంలో కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని మోడీ తెలిపారు.

కుళ్లు కమ్ముకున్న మనసులు పలికే మాటలు చివరికి దేశ సమగ్రత సమైక్యతలకు భంగకరం అవుతాయి. చివరికి వీరి విద్వేషం పరాకాష్టకు చేరుకుంటూ దేశాన్ని ముక్కలు చే సే ధోరణికి దారితీస్తోందని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలో కొన్ని వేదికలపై చేసిన వ్యా ఖ్యలు వివాదాస్పదం అయిన దశలో పేరు చెప్పకుండానే మోడీ ఈ వేదిక నుంచి ఆయనపై విరుచుకుపడ్డారు. తాను మూడో సారి అధికా రం చేపట్టి వందరోజుల పాలన పూర్తయిం ది.ఈ క్రమంలో ప్రతిపక్షం నుంచి తాను పలు అవమానాలు ఎదుర్కొన్నానని, గేలి చేశారని, అవహేళనలకు దిగారని మోడీ చెప్పారు. అయితే తాను ఇవేమీ పట్టించుకోకుండా ఈ సమయాన్ని కేవలం దేశ ప్రజల బాగుకు సంబంధించిన తమ వంద రోజుల అజెండాపైనే దృష్టి సారించానని మోడీ తెలిపారు. ప్రతి భారతీయుడికి దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే తపన ఉంది. ఈ క్రమంలో జట్టు స్ఫూర్తి కనబడుతోంది. అయితే ఇందుకు భిన్నంగా తుక్డే తుక్డే గ్యాంగ్ తిరోగమనం దిశలో ఆలోచిస్తోందన్నారు.

ప్రజల కోసం ప్రాణాలిస్తా ..జీవిస్తా
తాను జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేయాలని సంకల్పించుకున్నానని మోడీ స్పష్టం చేశారు. జీవిస్తే మీ కోసం జీవిస్తా, పోరాడితే మీ కోసం పోరాడుతా, బలిదానానికి దిగాలనుకుంటే మీ కోసం బలిదానం చేసుకుంటా అని అత్యంత ఉద్వేగభరిత ప్రసంగంలో మోడీ తెలిపారు. దేశం కోసం తాను సర్వదా పాటుపడి తీరుతానని ,ఈ క్రమంలో ఎటువంటి అడ్డంకులను అయినా ఎదుర్కొవడం జరుగుతుందన్నారు.

వందే మెట్రో కాదు … నమో భారత్ ర్యాపిడ్ రైలు
దేశంలోనే తొట్టతొలి వందే భారత్ మెట్రో రైలు సర్వీసును ప్రధాని మోడీ భుజ్ అహ్మదాబాద్ మధ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కొద్ది గంటల ముందు ఈ రైలుకు నమో భారత్ రాపిడ్ రైలుగా కొత్త పేరు పెట్టారు. గుజరాత్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకూ నడిచే ఈ మెట్రో వారానికి ఆరో రోజులు ఉంటుంది. 359 కిలోమీటర్ల దూరం ప్రయాణం ఐదుగంటల్లోనే పూర్తి అవుతుంది. ప్రధాన నగరాల మధ్య త్వరలో ఏర్పాటు అయ్యే వేగవంత వందేభారత్ శ్రేణి మెట్రో రైళ్లలో భుజ్ అహ్మదాబాద్ రైలు తొలి రైలు. కాగా దీనికి నరేంద్ర మోడీ పొడి అక్షరాలు నమో పేరు తగిలించారనే విమర్శలు ఇప్పుడు రాజుకుంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News