Saturday, November 16, 2024

‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’కు జెండా ఊపిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దక్షిణ భారత దేశంలో తొలి వందే భారత్ ట్రెయిన్‌కు, అలాగే భారత్ గౌరవ్ కాశీ దర్శన్ ట్రెయిన్‌కు శుక్రవారం కెఎస్‌ఆర్ బెంగళూరు స్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ఆరంభిచారు. వందే భారత్ ట్రెయిన్ మైసూరు నుంచి వయా బెంగళూరు, కాట్పాడి మీదుగా చెన్నయ్‌కు నడుస్తుంది. ఇది వారంలో బుధవారం ఒక్క రోజు తప్పించి మిగతా ఆరు రోజులు నడుస్తుంది. చెన్నైలో ఉదయం 5.50కు బయలుదేరే ఈ రైలు బెంగళూరుకు ఉదయం 10.15కు, మైసూరుకు 12.20కు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో మైసూరులో మధ్యాహ్నం 1.05కు బయలుదేరి బెంగళూరుకు మధ్యాహ్నం 2.50కు, చెన్నైకు రాత్రి 7.30కు చేరుకుంటుంది.
భారత్ గౌరవ్ రైలు బెంగళూరు నుంచి బయలుదేరి వయా హుబ్బల్లి, బెల్గావి, మిరాజ్, పుణే, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ మీదుగా వారణాసి చేరుకుంటుంది. ఇది సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని పరిచయం చేసే ఓ థీమ్ బేస్డ్ రైలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News