Monday, December 23, 2024

మరో రెండు వందేభారత్ రైళ్లకు జెండా ఊపిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

గోరఖ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు జెండా ఊపి ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పర్యటించిన ప్రధాని గోరఖ్‌పూర్ లక్నో, జోధ్‌పూర్‌అహ్మదాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అంతేకాకుండా రూ.498 కోట్లతో గోరఖ్‌పూర్ రైల్వేస్టేషన్ అభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయోధ్య మీదుగా వెళ్లే గోరఖ్‌పూర్‌లక్నో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ద్వారా ఉత్తరప్రదేశ్‌లో పర్యాటకాభివృద్ధికి మరింత ఊతమివ్వనుండగా, జోధ్‌పూర్ సబర్మతి రైలు జోధ్‌పూర్, అబూ రోడ్, అహ్మదాబాద్‌లాంటి ప్రాంతాలకు కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News